ఏపీలో టీడీపీ మాటెత్తితే అంతెత్తున లేస్తారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని). చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ నేతల్ని ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది ఈసారి నానిగారి టార్గెట్ మారింది. బీజేపీ నేతలపై ఆయనన విమర్శలు చేస్తున్నారు. గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారని, అదే హోదాతో ఆమె గుడివాడకు మంజైరైన ఫ్లై ఓవర్లను అడ్డుకుంటున్నారని నాని ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఈ మేరకు సోమవారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించారు కొడాలి నాని. ఇప్పటికైనా గుడివాడ అభివృద్ది పనులను అడ్డుకునే ప్రయత్నాలను విరమించాలని ఆయన పురందేశ్వరికి సూచించారు. లేనిపక్షంలో పురందేశ్వరి తీవ్ర పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని నాని వార్నింగ్ ఇచ్చారు. గుడివాడ ప్రజానీకం రైల్వే గేట్ల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారని నాని చెప్పారు. ఎంపీ బాలశౌరి లోక్ సభలో ఫ్లై ఓవర్లు కట్టాలని కోరారన్నారు.
సీఎం జగన్ కూడా రెండు ఫ్లై ఓవర్లు శాంక్షన్ చేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారన్నారు. ఈ నెల 26న టెండర్లు ఓపెన్ చేయాల్సి వుందన్నారు. అయితే పురందేశ్వరి అక్కడ వున్న షాపులు, పెట్రోల్ బంకుల వారికి ఫ్లై ఓవర్లు ఆపాలని కేంద్రమంత్రి గడ్కరీకి లేఖ రాశారన్నారు. ఈ నెల 14న గడ్కరీని కలవాలని పురందేశ్వరి కేంద్రమంత్రిని కోరారని అన్నారు. గుడివాడ టీడీపీ నేతలు కూడా కుమ్మక్కయ్యారన్నారు. ఈ ఫ్లై ఓవర్లు పడితే ఎంపీకి, నాకు, వైసీపీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. గుడివాడలో రెండు ఫ్లై ఓవర్లు కడితే ఎంతోమందికి ఉపయోగం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా 10మంది కోసం ఇలా ఫ్లై ఓవర్లు ఆపాలని ప్రయత్నించడం దారుణం అన్నారు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించా కానీ ఫలితం లేదన్నారు. గుడివాడ ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఫ్లై ఓవర్లు ప్రారంభించేవరకూ టెంట్ వేసి ఆందోళన సాగిస్తామని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.
Anushka Shetty: హీరోయిన్ అనుష్క అన్న హత్యకు కుట్ర..?