Site icon NTV Telugu

BRS Effect on AP: బీఆర్ఎస్ వల్లే నష్టపోయాం.. ఏపీపై ఆ పార్టీ ప్రభావం శూన్యం

Kodali Nani

Kodali Nani

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేవారు గులాబీ పార్టీ బాస్‌ కేసీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌పై కూడా ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.. తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సహా మరికొందరు నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు.. మరోవైపు, ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని.. గెలిచేది కూడా తామేనని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. అంతేకాదు, పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.. దీంతో, ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా? బీఆర్ఎస్‌ పట్టుభిగిస్తుందా? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

Read Also: Kodali Nani: చంద్రబాబు నరరూప రాక్షసుడు.. నూటికి నూరు శాతం ఆయన పిచ్చితోనే మరణాలు..!

దానికి గల కారణాలకు కూడా చెప్పుకొచ్చారు కొడాలి నాని.. బీఆర్ఎస్‌ వల్లే నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలపై బీఆర్ఎస్‌ పార్టీ ప్రభావం శూన్యమని తేల్చేశారు.. అయితే, జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.. ఎన్నికలకు వెళ్లేందుకు మాకు ఎవరి మద్దతు అవసరం లేదన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. అయితే, అంశాల వారీగానే జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామే తప్ప, వైసీపీకి ఎవరితో పొత్తులు ఉండదని కుండబద్దలు కొట్టారు మాజీ మంత్రి కొడాలి నాని.

Exit mobile version