Kilari Rosaiah: వైసీపీకి మరో షాక్.. డిప్యూటీ సీఎం పవన్తో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య భేటీ..

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..
  • డిప్యూటీ సీఎం పవన్ తో కిలారు రోశయ్య భేటీ..
  • రేపు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య..
Roshaiah

Roshaiah

Kilari Rosaiah: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో రోశయ్య, ఉదయ భాను సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేపు (ఆదివారం) మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసేన అధినేత పవన్ చేతుల మీదుగా కండూవా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు వియ్యంకుడు రవిశంకర్‌ కూడా జనసేన గూటికి చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

Read Also: Malavika Mohanan: ప్రభాస్‌పై మాళవిక ప్రసంసల వర్షం.. ‘రాజాసాబ్‌’ షూటింగ్‌ అప్‌డేట్

అయితే, 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలుపొందిన రోశయ్య.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి.. తెలుగుదేశం పార్టీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. 3.50 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిని చవి చూశారు. తాజాగా, వైసీపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదన్నారు.