Karumuri Nageswara Rao Fires On Chandrababu Manifesto: ఇటీవల మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మేనిఫెస్టో ఒక టిష్యూ పేపర్ లాంటిదని.. తుడుచుకోవడానికి తప్ప దేనికీ పనికిరాదని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు అవుతోందని అన్నారు. మొదటి కలెక్టర్ల మీటింగ్‌లోనే ప్రజలకు న్యాయం చేయాలని జగన్ చెప్పారని, కానీ చంద్రబాబు మాత్రం కేవలం పార్టీ వారికే పనులు చేయండని చెప్పారని.. ఇదే జగన్‌కి, చంద్రబాబుకి ఉన్న తేడా అని వివరించారు. జగన్ నిర్ణయం వల్ల.. కులం, మతం, పార్టీలతో పని లేకుండా సంక్షేమాన్ని అందించామని అన్నారు.
Vizag Job Scam: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
బీసీలకు చంద్రబాబు కేవలం రూ.35 వేల కోట్లే ఖర్చు చేశారని.. ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక 56 కార్పోరేషన్లు పెట్టి బీసీలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తోకలు కత్తిరిస్తానని దూషిస్తారని మండిపడ్డారు. జగన్ అమలు చేస్తున్న పథకాల గురించి పేపర్ చూడకుండా చెప్తే.. పది లక్షలిస్తానని ఛాలెంజ్ చేశారు. టీడీపీ వారికి కూడా ఈ సవాల్ చేస్తున్నానని.. అధికారులు, విలేకర్లు సైతం ఈ ఛాలెంజ్‌ని స్వీకరించవచ్చని చెప్పారు. అధికారంలో ఉంటే దోచుకోవటం, దాచుకోవడమే చంద్రబాబు పని అని ఆరోపించారు. జగన్ హయాంలో ఫ్యామిలీ డాక్టర్ నుండి అనేక పథకాలు ప్రజల ముంగిటకే వచ్చాయన్నారు. ఒక మీడియాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు మాయ చేయటం తప్ప మరేమైనా చేయగలిగాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖంలో ప్రేతకళ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Odisha: భార్యపై అనుమానం.. పసిబిడ్డకు పురుగుమందుతో ఇంజెక్షన్..
గతంలో ఇచ్చిన 650 వాగ్దానాలను ప్రజలకు కూడా కనపడకుండా చేసిన ఘనత చంద్రబాబుది అని మంత్రి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. నెరవేర్చని హామీలను మళ్ళీ ప్రజల వద్దకు తెస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో తాము చేసిన పథకాల గురించి తాము చెప్పగలమని చెప్పారు. అయితే.. తాము తెచ్చిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు గోల చేశాడని, మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు సంక్షేమ పథకాలను తెస్తానంటున్నారు? అని నిలదీశారు. ఈ డబ్బు ఎక్కడ నుండి తెస్తావ్? అని అడిగారు. మాయల ఫకీరులకే మార్తండ చంద్రబాబు అని కౌంటర్ వేశారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని పేదలను ఇప్పుడు కోటేశ్వరులను చేస్తానంటూ చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.