Site icon NTV Telugu

Karumuri Nageshwarrao:అయ్యన్న తప్పుచేస్తే చూస్తూ ఊరుకోవాలా?

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారు.మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి?

బీసీలు సెక్రటేరియట్ కి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు, అలాంటి వ్యక్తి బీసీలకి ఎలా న్యాయం చేస్తాడు? అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు మహిళల గురించి చేశారో చూశాం అన్నారు మంత్ర కారుమూరి నాగేశ్వరరావు. బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడు. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిది.

రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారు. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోంది. కానీ చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారు. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదంట. ప్రపంచమంతా కూడా రాకుండా ఆపేవారేమో? తుఫానులు ఆపుతానంటాడు.ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు. ఇలాంటి పిచ్చిమాటలు విని జనం నవ్వుతున్నారు. విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారు.

మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలి. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జైజగన్ అంటున్నారు. జగన్ పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదు. ఇక ఇంటికొకరు ఏం వస్తారు? కేంద్రంపై పోరాటం చేయలేక జగన్ ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Agnipath: సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు.. అల్లర్లకు పాల్పడిన వారిని చేర్చుకోం

Exit mobile version