Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- డీసీఎం లారీని ఢీకొట్టిన స్లీపర్ బస్సు
- అద్దాలు పగిలి ముగ్గురికి స్వల్ప గాయాలు
- 36 మంది ప్రయాణికులు సురక్షితం
- డ్రైవర్ నిద్రమత్తే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ఆదివారం ఉదయం ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. జాతీయ రహదారిపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న డీసీఎం లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ‘యోలో’ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ఎడమవైపు భాగం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, విండ్‌షీల్డ్, కిటికీ అద్దాలు నుజ్జునుజ్జయ్యాయి. అద్దాల పెంకులు గుచ్చుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!