కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, వంగా గీతా విశ్వనాథ్ వచ్చారు. ధ్వంసమైన కారును పరిశీలించారు. అనంతరం.. ఘటన ఏ విధంగా జరిగిందని ముద్రగడను అడిగి తెలుసుకున్నారు.
Read Also: Uttam Kumar Reddy : బీసీ జనాభా 46.25 శాతం.. సామాజిక న్యాయం కోసమే సర్వే
అనంతరం కన్నబాబు మాట్లాడుతూ.. ముద్రగడ ఇంటి దగ్గర విధ్వంసం సృష్టించి కారు మీద దాడి చేశారని అన్నారు. ప్రభుత్వం ఉదాసీనత వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికి వదిలేశారని ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి తాను జనసేన అని చెబుతున్నాడు.. రెడ్ బుక్ రాజ్యాంగం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: Samantha: ఆ దర్శకుడితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన సమంత?
చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వలన ముద్రగడ ఇంటి మీద దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వ్యక్తి తాను జనసేన కార్యకర్త అని ప్రకటించాడు.. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రశాంతమైన జిల్లాలో అరాచకలు, ఆకృత్యాలకి ఎవరు కారణం? అని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు.