NTV Telugu Site icon

YS Jagan: ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..

Jagan

Jagan

కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించే వారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది.. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది.. వాతావరణ శాఖ అలర్ట్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.

Read Also: Arekapudi Gandhi: ఆంధ్రోళ్ల పవర్.. తెలంగాణ పవర్ అంటూ మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి?

బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీన వచ్చిన 9950 క్యూసెక్కులు కిందికి ఎందుకు వదల లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నా.. పై నుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు.. ఇది మెన్ మెడ్ ఫ్లడ్ అని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వం.. ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో గ్లోబెల్స్కి తమ్ముడు అవుతాడని విమర్శించారు. అబద్ధాలు తయారు చేయగలడు, వాటిని అమ్మగలడని ఆరోపించారు. మీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా.. ఇంకా జగన్ నామం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏమి అయినా జగన్ కారణం అంటున్నారు.. సచివాలయాలను, వాలంటరీ వ్యవస్థలను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.

Read Also: Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు

ఈ క్రాప్ ఏమి అయింది.. తమ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తు వచ్చి ఉండి ఉంటే ఎకరానికి 40 నుంచి 45 వేలు రైతులుకి వచ్చేవని జగన్ చెప్పారు. జగన్ మీద అరవకుండా ఆలోచించాలి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. తప్పు ఒప్పుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. చంద్రన్న వస్తాడు.. 20 వేలు ఇస్తాడు అని రైతులకు చెప్పాడు.. పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు బాగా నటిస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి పెద్దగా తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు.