Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu: ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం..! యనమల సంచలన వ్యాఖ్యలు..

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తునిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎప్పుడూ ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని, ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలమని అన్నారు యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే పొరపాటు అని.. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామని కార్యకర్తలను హెచ్చరించారు.. అయితే, మెడికల్ కాలేజ్ ల నిరసనలో ప్రతిపక్షంలో కసి పెరిగిందని.. ర్యాలీ కోసం గ్రామాలు నుండి తీసుకుని వచ్చారని అన్నారు యనమల.. కాగా, తుని టీడీపీ కార్యకర్తల సమావేశంలో యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి..

Read Also: Gannavaram to Singapore: గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు.. ఐదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభించిన ఇండిగో..

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడ్‌లో అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పీపీపీ మోడ్‌ అంటే మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడమే అని మండిపడుతున్నారు.. తాజాగా, ఏపీ వ్యాప్తంగా వైపీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ఈ తరుణంలో టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి..

Exit mobile version