Maoist Hidma Security Team Arrest: ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న హిడ్మా సెక్యూరిటీ..! అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న హిడ్మా సెక్యూరిటీ..
- ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, కొప్పవర ప్రాంతంలో..
- ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Hidma Security Team Arrest: అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు కీలక నేత హిడ్మా ప్రాణాలు విడిచారు.. అయితే, హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ.. మరో నలుగురు మావోయిస్టులు కూడా మృతిచెందారు.. అయితే, ఈ ఎన్కౌంటర్ నుంచి హిడ్మా సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, కొప్పవర ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు మహిళలు PLGA టాప్ లీడర్ హిడ్మాకు సెక్యూరిటీగా పనిచేస్తుండగా, హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కాకినాడ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
పోలీసులు ఇద్దరు మహిళా మావోయిస్టులను అంకిత మరియు అనూషగా గుర్తించారు. ఈ ఇద్దరు మహిళా మావోయిస్టులను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతం నుంచి శంకవరం, రౌతులపూడి మార్గం ద్వారా కాకినాడ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులకు చిక్కారు.. పోలీసులు వివరించిన వివరాల ప్రకారం, హిడ్మా పై జరిగిన ఆపరేషన్ల తర్వాత మావోయిస్టుల షెల్టర్ జోన్లపై కొనసాగుతున్న దాడులలో భాగంగా ఈ మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించి మరిన్ని ముఖ్య సమాచారం పొందేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం పలు జిల్లాలో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.. ఏకంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం విదితమే. మరోవైపు.. అల్లూరి జిల్లాలో నిన్నటి నుంచి మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతుంగా.. ఈ రోజు ఎన్కౌంటర్లో మరో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..