Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thota Trimurthulu: కాకినాడలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కాపు సామాజిక వర్గమే కారణమని బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమేనని అన్నారు. కాపు ఓటు ఎటు వైపు ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని, కాపులు స్వయంగా ఎక్కువ మంది గెలవకపోయినా గెలిపించే, ఓడించే శక్తి తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలకు టీడీపీ నాయకులు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని తోట త్రిమూర్తులు విమర్శించారు. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారడం ఉండదన్నారు. విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బొండా ఉమా ప్రకటించడం అభినందనీయమని, ఆయన నిర్వహించే సంస్మరణ సభకు తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు.
ప్రజారాజ్యం పార్టీ కారణంగానే ఒకప్పుడు టీడీపీ ఓటమిపాలైందని గుర్తుచేసిన త్రిమూర్తులు, కాపు నాయకత్వానికి సరైన అవకాశాలు రాకపోవడం బాధాకరమన్నారు. వంగవీటి రంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను అడ్డుకున్నారని, ముద్రగడ పద్మనాభం వద్ద సరైన సమయంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల కాపు వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని తోట త్రిమూర్తులు వెల్లడించారు. 2016లో ముద్రగడ ఉద్యమానికి మద్దతుగా తాను, బొండా ఉమా కలిసి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో వెళ్లొద్దని అప్పటి హోంమంత్రి రాజప్పతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ చేసినా తాము వెనక్కి తగ్గలేదన్నారు.
Also Read
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
- Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ముద్రగడ పద్మనాభంపై యువత సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విమర్శలు బాధ కలిగిస్తున్నాయని తోట త్రిమూర్తులు అన్నారు. ఆయన చేసిన మంచి పనులను గుర్తించాలని కోరారు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన తర్వాత ముద్రగడ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. 1978లో ముద్రగడతో పాటు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో ఎదిగారని, కానీ ముద్రగడ మాత్రం తన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..
తాజావార్తలు
-
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
-
Netanyahu: వస్తున్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు సవాల్
-
Vastu Tips for Money: అప్పులు తీరాలంటే.. ఈ రూల్స్ పాటించండి.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
-
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!