MLC Nagababu: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తుండగా జై వర్మ, జై టీడీపీ అంటూ పసుపు జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక, దీనికి జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డు పడటంతో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
అయితే, పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్పీఎస్‌ఎన్ వర్మ తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ ను గెలిపించారని.. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోవడం వెనక కూడా నాగబాబు కుట్ర ఉందని టీడీపీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గొల్లప్రోలులోనూ అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలోనూ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తాజాగా కుమారపురంలోనూ ఎస్పీఎస్‌ఎన్ వర్మకు సపోర్టుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునేందుకు ట్రై చేశారు తెలుగు తమ్ముళ్లు.