Minister Nadendla Manohar: జనసేన ఆవిర్భావోత్సవానికి పిఠాపురం సిద్ధమవుతోన్న వేళ.. ఓవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని పేర్కొన్న ఆయన.. ఇక, వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. వాళ్ల పార్టీ.. ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.. వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం మాకు ఏమి ఉంటుంది? అని ప్రశ్నించారు. ఇక, పవన్ కల్యాణ్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్‌మెంట్‌తో పాటు పార్టీ పరంగా మేం కూడా చూసుకుంటాం.. సభా ప్రాంగణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం అన్నారు..
Read Also: Robinhood : అదిదా సర్ప్రైజ్ ప్రోమో.. మల్లెపూలతో మత్తెక్కిస్తున్న ‘కేతిక కెవ్వు కేక’
ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభం అవుతుందన్నారు నాదెండ్ల మనోహర్.. భాష, సంస్కృతిని గౌరవించుకునేలా సభ జరుగుతుంది.. సభ పూర్తయిన తర్వాత పారిశుద్ధ్యం భాద్యత కూడా మేమే తీసుకుంటాం.. భారత దేశంలో ఏ పార్టీ కూడా ఈ విధంగా పర్యావరణం కూడా ఆలోచించి ఉండదన్నారు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. కాగా, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి పిఠాపురం వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది జనసేన పార్టీ.. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారడం.. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కావడం.. కీలక శాఖలను జనసేన దక్కించుకున్న తర్వాత.. జరుగుతోన్న తొలి ఆవార్భావోత్సవం కాబట్టి.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడానికి ప్లాన్ చేస్తోంది జనసేన పార్టీ.. ఈ సభా వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..