NTV Telugu Site icon

Minister Nadendla Manohar: జాయింట్ కలెక్టర్పై మంత్రి నాదెండ్ల సీరియస్

Nadendla

Nadendla

ఇవాళ కాకినాడ జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతుల విషయంలో విపక్ష చూపించారు.. చట్టంలో మార్పు తీసుకుని వస్తామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించారు.. వ్యవస్ధాపరమైన లోపాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మిల్లెట్స్ పంటలు ను ఎంకరేజ్ చేస్తాం.. ప్రభుత్వం ఇచ్చిన సరకు అంగన్ వాడీలు, రెసిడెన్షియల్ హాస్టల్ లలో అదే ఇస్తున్నారని మీరు ఎలా ఐడెంటిపై చేస్తున్నారని సివిల్ సప్లై అధికారులను మంత్రి ప్రశ్నించారు. నాదెండ్ల ప్రశ్నలకు అధికారులు సైలెంట్ అయ్యారు. గత మూడు నెలల్లో ఎక్కడ కేసులు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హాస్టల్స్ కి ఎందుకు వెళ్లడం లేదని అధికారులను సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రశ్నించారు.

Read Also: Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి బెయిల్..

ఇక, గత పది రోజులుగా పీడీఎస్ రైస్ ఎక్కువ మూమెంట్ అవుతుందని ఎందుకు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జేసీ రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు. రేషన్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్న ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేట్ తో సంబంధము ఏమి ఉందని ప్రశ్నించారు.. ఎన్నికలు ముగిసిన అధికారులు స్లీప్ మోడ్ లో ఉంటున్నారు.. అదేం సమాధానం అంటూ జెసీపై ఫైర్ అయ్యారు. జగనన్నకి చెప్పి చెప్పి జనం అలసిపోయారు.. కొత్త రేషన్ కార్డులు కోసం డేటా తీసుకోండి అని సివిల్ సప్లై మినిష్టర్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.