కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణలో భాగంగా కేరళ సీబీఐ అధికారులు కాకినాడకు వచ్చారు. 2023 నవంబర్ 25వ తేదీన సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా.. ఆ మృతదేహం ఎవరిదని అధికారులు ఆరా తీశారు. అయితే.. మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మరోవైపు.. చనిపోయిన వ్యక్తి ఫోటో చూసి ఆర్మీలో పని చేస్తున్న శశాంక్ గా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi Plane Cost: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం ధర ఎంతో తెలుసా?
ఈ క్రమంలో.. పూడ్చి పెట్టిన మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కేరళ న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో.. మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ మృతదేహం శశాంక్ దా.. కాదా అనేది విచారణ చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఆర్మీలో పని చేస్తూ అరుణాచల్ ప్రదేశ్‌లో శశాంక్ తప్పిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Read Also: Pawan Kalyan: భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన..