Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!

Kakinada

Kakinada

Kakinada: కాకినాడ లో ఫీజు కోసం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలయ్యాడు. మనస్దాపంతో ఇంట్లో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కాకినాడ జగన్నాధపురంకి చెందిన పైలా అరవింద్ ఇంటర్ ఎంపిసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్ 30 వేలు చెల్లించలేదని అరవింద్ తండ్రిని పిలిపించి అవమానించింది యాజమాన్యం. ఫీజులు కట్టలేనప్పుడు చదువులు ఎందుకని చులకనగా మాట్లాదినట్లు సమాచారం. అంతేకాకుండా తండ్రిని అవమానించడంతో మనస్ధాపంతో‌ ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అరవింద్.

అయితే తల్లికి వందనం‌ డబ్బులు పడగానే ఫీజు చెల్లిస్తామని చెప్పినా యాజమాన్యం కనికరించలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఆగ్రహంతో కళాశాలలోకి చొచ్చుకు వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అరవింద్ బంధువులు, స్నేహితులు. తమ కొడుకు తనకు కావాలని, ఇబ్బందులు పెట్టి వాడి చావుకు కారణం అయ్యారని తల్లిదండ్రులు తల్లి పోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.