Road Accident: పెళ్లి కారు బీభత్సం.. నలుగురు మృతి, ఏడుగురికి సీరియస్..
- కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర పెళ్లి కారు బీభత్సం..
- విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం సమీపంలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… పెళ్లికారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలు పాలయ్యారు.. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక పెళ్లి కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అన్నవరం వద్ద పెళ్లి కార్యక్రమం ముగించుకుని జగ్గంపేటకు తిరిగి వెళ్తుండగా, కారుకు ఫ్రంట్ టైర్ పేలడంతో అది నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ప్రజలపై దూసుకెళ్లింది.. దీంతో, ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు.. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని తక్షణం సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.. ఇక, ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. బాధితులను పరామర్శించారు. గాయలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Koti Deepotsavam 2025: కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!