Site icon NTV Telugu

Kakinada Love Story: ఆరేళ్ల ప్రేమ, పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. చివరికి ఏమైందంటే..?

Kkd

Kkd

Kakinada Love Story: కాకినాడ జిల్లాలో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న యువ జంట పెళ్లి వివాదం చివరకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. అరుణ్ కుమార్ అనే యువకుడు, ధనలక్ష్మి అనే యువతి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యువకుడు నిరాకరించడంతో ఈ వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురి కుటుంబాలతో చర్చించారు.

Read Also: Bandi Sanjay: కేసీఆర్ కు, మీకు తేడా ఏముంది?.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్

ఈ సందర్భంగా ఈ సమస్యను మీరే తేల్చుకోండి లేదంటే కేసు పెడతాం, లేకపోతే అవగాహనకు రావాలి అని కాకినాడ పోర్టు పోలీసులు సూచించారు. దీంతో కాలనీ పెద్దలు, పోలీసుల సమక్షంలో పక్కనే ఉన్న గుడిలో ఇద్దరికీ వివాహం జరిపించారు. అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేకపోయినా, పరిస్థితుల రీత్యా వివాహం జరిపించాల్సి వచ్చింది. దీంతో అరుణ్ కుమార్- ధన లక్ష్మీల ప్రేమ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version