NTV Telugu Site icon

Annavaram Prasadam: అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు…

Annavaram

Annavaram

Annavaram Prasadam: అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..

Read Also: Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించే ఛాన్స్

అన్నవరం సత్యదేవుని ఆలయం 1891లో ప్రతిష్టించబడింది.. అప్పటినుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్ని అందిస్తున్నారు.. అన్నవరం ప్రసాదం అంటే భక్తులకు ఎంత ప్రీతి ప్రాతమో చెప్పనవసరం లేదు.. భారత ఆహార ప్రమాణాల సంస్థ తాజాగా ఈ ప్రసాదానికి గుర్తింపు ఇచ్చింది. ఏటా రెండు కోట్లకు పైగా ప్రసాదాలు విక్రయాలు జరుగుతూ ఉంటాయి.. ఒక ప్రసాదం ద్వారానే దాదాపు 40 కోట్ల ఆదాయం వస్తుంది.. కోట్లాదిమంది మనసులు దోచే అన్నవరం ప్రసాదం తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. స్థానికంగా దొరికే దినుసులతో ప్రసాదం తయారు చేయరు.. మధ్యప్రదేశ్ నుంచి మల్వరాజ్ గోధుమలను దిగుమతి చేసుకుంటారు.. వాటిని గ్రైండ్ చేయడానికి ప్రత్యేక యంత్రాలు వాడుతారు.. గతంలో ఈ ప్రసాదానికి ఐఎస్ఓ గుర్తింపు కూడా లభించింది.. సత్య దేవుడి ప్రసాదం ఇప్పటికీ విస్తరాకుల్లోనే భక్తులకు అందిస్తున్నారు.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా విస్తరాకులే వినియోగిస్తున్నారు.. అత్యంత వేడి కలిగిన ఈ ప్రసాదం విస్తరాకులలో వేయగానే ఆవిరి సుగంధద్రవ్యాలతో ఆకు మధురంగా మారుతుంది.. ఈ విస్తరాకులను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొస్తారు.. బయట ఈ ప్రసాదం తయారీ ట్రై చేసిన ఆ రుచి మాత్రం రాదు.

Read Also: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన..

150 గ్రాములు ప్రసాదాన్ని 20 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు.. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానం చర్యలు చేసుకుంటుంది.. ప్రసాదం తయారు చేసే స్వాములు కూడా అత్యంత నిష్టతో ఉంటారు.. ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తారు.. 45 లీటర్ల నీటిని బాగా మరిగించి 15 కిలోల గోధుమలు వేస్తారు.. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో వేసి ఉడికిస్తారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి యాలకుల పొడిని కలుపుతారు ఆ తరువాత గంటసేపు వంట స్వాములు బాకు తో తిప్పుతారు.. ఆ తర్వాత ట్రాలీ తొట్టెలో వేసి మూడు గంటలు పాటు ఉంచుతారు… తెలుగు రాష్ట్రాల్లోనే అన్నవరం సత్యదేవుడు ప్రసాదం ఎంతో ఫేమస్.. అడ్డాకులో వేసి భక్తులకు విక్రయిస్తారు.. రుచి సూచీలో తిరుగులేదు భారత ఆహార ప్రమాణాల సంస్థ పూర్తిగా పరిశీలించి గుర్తింపు ఇచ్చింది.. రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు అలా అయితే తమ పనులు అవుతాయని లెక్కలు వేస్తారు.. మొత్తానికి అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి భారత ఆహార ప్రమాణ సంస్థ గుర్తింపు లభించింది.. రుచి, శుచిలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా వ్యవహరిస్తున్నది దేవస్థానం.. పాత సాంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రసాదం విషయంలో మాత్రమే ఎక్కడా రాజీ పడడం లేదు.. అరుదైన గుర్తింపుతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.