Site icon NTV Telugu

SVSN Varma: పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

Vanga Geetha, Varma

Vanga Geetha, Varma

SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు.. గీత అక్కయ్య అమావాస్య పౌర్ణమికి కనిపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు.. దమ్ముంటే ఉప్పాడ సెంటర్ కి వచ్చి చర్చించాలి అంటూ సవాల్‌ చేవారు.. ఎంపీగా పిఠాపురానికి గుండు సున్నా ఇచ్చారు అంటూ వంగా గీతపై విరుచుకుపడ్డారు.. నారా చంద్రబాబు నాయుడు ఆనవాళ్లు కనిపించకూడదని ఏలేరు ఆధునీకరణ శిలాఫలకాలను జేసీబీలతో మీరే ధ్వంసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆధునీకరణ కావాలి అని అడిగితే జగన్‌ ఏమీ చేయలేదన్నారు.. ఇన్ని అబద్ధాలు నేను ఎక్కడా చూడలేదు అంటూ వంగా గీతపై ఫైర్‌ అయ్యారు.. ఏలేరు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి అంటూ డిమాండ్‌ చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ.

Read Also: CM Chandrababu: ఎంఎస్ఎంఈ పార్క్‌ను ప్రారంభించిన సీఎం.. వర్చువల్‌గా 50 ఎంఎస్ఎంఈ పార్క్‌లకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు

Exit mobile version