Physical Harassment: నిత్యం ఏదో ఒక మూల.. మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.. పసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు.. వృద్ధులు అనే తేడా లేకుండా.. ఎక్కడో ఓ చోట.. ఈ వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి.. దీనిపై పది మందితో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్.. కమిటీ దృష్టికి కీలక విషయాలు తీసుకువచ్చారు విద్యార్థినులు..
Read Also: Malaysia: నదిలో కూలిపోయిన పోలీస్ హెలికాప్టర్.. వీడియో వైరల్
బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్ టీ ప్రసాద్ లు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. దాంతో విద్యార్థినుల నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకుంది కమిటీ.. తమ శరీరాన్ని తాకుతూ, బుగ్గలు నిమురుతూ వికృత చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు.. తమ ఫోటోలు అసభ్యకరంగా తీసి, వన్ టైం వ్యూ ద్వారా తమ వాట్సాప్ కి పంపించే వారని కంప్లైంట్ చేశారు.. రూమ్‌కి రమ్మని బెదిరించడం.. డబ్బులు ఇస్తానని అనడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. మద్యం సేవించి బూతులు తిట్టేవారని, తమ మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కమిటీ దృష్టికి తీసుకుని వెళ్లారు విద్యార్థినులు..
