NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: నేరుగా రంగంలోకి దిగిన పవన్‌ కల్యాణ్‌.. అక్రమ దందాలపై సీరియస్‌..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: రేషన్‌ బియ్యం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు ఎప్పడి నుంచో ఉన్నాయి.. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్టుగానే.. రేషన్‌ బియ్యం ఇతర దేశాలకు తరలించే క్యాష్‌ చేసుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రయత్నాలు చేశారు.. కొన్నింటిని అడ్డుకోగలిగారు.. అయితే, ఈ రోజు నేరుగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగారు.. కాకినాడ పోర్ట్‌ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రేషన్‌ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్‌లో వెళ్లిన పవన్‌.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పరిశీలించారు.. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు.. సముద్రంలో 9 నాటికల్‌ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్‌ కల్యాణ్‌ .. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు..

Read Also: BiggBoss : బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టికెట్ టు ఫినాలే ఎవరికి ఇచ్చిందో తెలుసా ?

ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. డిప్యూటీ సీఎం అయిన నాకే పోర్టు అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాల్సిందే అన్నారు.. అసలు నేను పర్యటనకు వస్తే.. ఎస్పీ ఎందుకు కనిపించడం లేదు ? అని ప్రశ్నించారు పవన్‌.. నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు ఎందుకు తీసుకున్నాడు.. ఇదంతా చాలా బాగుంది అంటూ ఎద్దేవా చేశారు.. పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్ అధికారులు చాలా నామ మాత్రంగా యాక్షన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కాకినాడ స్మగ్లింగ్ కి హబ్ అయిందని గతంలో చెప్పామని గుర్తుచేసుకున్న ఆయన.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అని వార్నింగ్‌ ఇచ్చారు.. 13 గోడౌన్లలో 51 మెట్రిక్ టన్నుల పేదలు బియ్యం సీజ్ చేశాం.. 1000 లారీలు వెళ్లే పోర్ట్ కి 16 మందికి సెక్యూరిటీ ఉన్నారంటే అర్ధం అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందనేది అన్నారు..

Read Also: Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు

అయితే, సముద్రం లోపలికి వెళ్లి చూస్తాను అంటే డిప్యూటీ సీఎం అయిన నాకు పోర్ట్ అధికారులు సహకరించలేదన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక్కడ చాలా డీప్ నెట్ వర్క్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.. నన్ను రావొద్దని చాలా మంది చెప్పారు.. కానీ, కాకినాడ పోర్ట్ లో స్మగ్లింగ్ కి అనుమతి ఇవ్వలేదు కదా? అని నిలదీశారు.. రైస్ చూస్తా అంటే పోర్ట్ అధికారులు షిప్ చుట్టూ తిప్పుతున్నారు.. పోర్ట్ అధికారులు నాకు కథలు చెబుతున్నారని మండిపడ్డారు.. ఏపీ గంజాయి కి అడ్డాగా మారిపోయిందన్న ఆయన.. రైస్ ఒక్క విషయం కాదు.. ఇక్కడ చాలా సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయన్నారు.. కసబ్ సముద్ర మార్గంలోనే ఇండియాకి వచ్చాడు.. ఎస్పీ స్టార్టింగ్ రోజు అడిగాను.. ఇప్పటి వరకు రిపోర్ట్ లేదని దుయ్యబట్టారు.. ఇక, నా మీద ఒత్తిడి తెస్తున్నారు.. ఉగ్రవాదులు వచ్చి కాల్చేస్తే ఇక్కడ దిక్కు లేదన్నారు.. ఈ వ్యవహారాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి లెటర్ రాస్తున్నాను అని వివరించారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్న అక్రమంగా తరలించి ఆఫ్రికా దేశాల్లో కిలో 73 రూపాయలకి చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..