NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. అడ‌ప‌డుచుల‌కు డిప్యూటీ సీఎం అదిరిపోయే గిఫ్ట్‌లు..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్‌ ఉంది.. దానికి అనుగుణంగా.. పవన్‌ కల్యాణ్ కూడా తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే.. నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించారు.. అంతేకాదు.. ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, ప్రతీ ఏడూ శ్రావణమాసం చివరి శుక్రవారం రోజున పిఠాపురంలోని పురూహూతికా దేవాలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు.. అదే కోవలో ఈ ఏడాది కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేయగా.. తాను గెలిచిన తర్వాత వచ్చిన తొలి ఈవెంట్‌ కాబట్టి.. అందరికీ అదిరిపోయే గిఫ్ట్‌లు పంపారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్‌డేట్‌.. షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడే!

అయితే, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశానుసారం సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పాస్ లు జారీ చేయడం గందరగోళంగా తయారయ్యింది అంటున్నారు.. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పాదగయలో జరిగే వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే వారందరికి అందించేందుకు వీలుగా 12వేల చీరలను పంపించినట్లు జనసేన వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.. ఈ నేపథ్యంలో మహిళలు భారీ సంఖ్యలో పాద గయ క్షేత్రానికి టోకెన్లు కోసం మధ్యాహ్నం నుండి బారులు తీరారు.. అయితే పాదగయలో ఆరువేల మందికి మాత్రమే వ్రతాలు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.. వరలక్ష్మి వ్రతాలకు కేవలం ఎనిమిది వందల నుండి వెయ్యి టికెట్లు వరకు ఆలయ సిబ్బంది జారీ చేసి చేతులెత్తేశారు.. టోకెన్లు కోసం మహిళలలు 5 వేలకు పైగా రావడం, టోకెన్లు మాత్రం నామమాత్రంగా జారీచేయడంపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు.. అంతా గందరగోళంగా మారడంతో స్థానికుల్లో ఆగ్రహాన్ని తెచ్చింది. 12 వేలు వ్రతాలకు సంబంధించి చీరలు, పూజ సామాన్లు పంపిణీ కి సిద్ధం చేశామని చెప్పగా , నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉదయం 9గంటలకే వచ్చి క్యూలైన్లుల్లో నిలుచున్నామని. వర్షానికి తడస్తూ, ఉక్కపోతతో సతమవుతూ అయిదు గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని.. అధికారులు మాత్రం తూ తూ మంత్రంగా టోకెన్లు జారీ చేసి చేతులు ఫులుపుకున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా నామమాత్రమేనని.. అన్ని సద్దుకుంటాయని.. సామూహిక వరలక్ష్మి వ్రతాలు విజయవంతంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.