NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్య

Kakani

Kakani

Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్య.. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం, జిల్లాలో ఒక పరిస్థితి ఉంటే.. సర్వేపల్లి నియోజవర్గంలో పరిస్థితి మరోలా ఉంది అని ఆయన పేర్కొన్నారు. 20 సంవత్సరాల తరవాత గెలిచిన సోమిరెడ్డి ప్రజలకు మంచి చేసే పనులు విస్మరిస్తున్నారు.. సోమిరెడ్డి, ఆయన కొడుకు రెండు సంచులు పట్టుకొని సాయంత్రానికి సంచుల నిండా డబ్బుతో ఇంటికి వెళ్తున్నారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Train Accident: మరో రైలు ప్రమాదం.. ఊడిపోయిన రెండు కోచ్‌లు

ఇక, అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అవుతున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసింది శూన్యం అని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. లే అఔట్స్ యజమానులను గందరగోళం చేసి వాళ్ల దగ్గర మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు.. సోమిరెడ్డికి చెవుడు అనుకున్నాం.. కానీ ఈ మధ్య పిచ్చి కూడా పట్టింది అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అరిచే కుక్క కరవదు.. అనే సామెత మాదిరిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరుపులే తప్ప వాటిలో పస లేదు అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పు్కొచ్చారు.