NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ తాజాగా నిప్పులు చెరిగారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఉంటే కరువు రాజ్యమేలుతుందని, కానీ సీఎం జగన్ హయాంలో నాలుగేళ్లల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు. చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి రాగానే మాట మార్చాడని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులకు అడుక్కుని తినే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అయితే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని రైతుల ఆత్మహత్యల్ని జాబితాలో చేర్చలేదని ఆరోపించారు.

Pilli Subhash Chandrabose: పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

చంద్రబాబుకు వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదని.. ఆయన కాలంలో శ్వేతపత్రం అంటే తెల్లకాగితమే మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవటమేనని చంద్రబాబు చెప్పిన మాటల్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు. బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయాడా? అని నిలదీశారు. కరువు, రెయిన్ గన్‌లు మినహా.. చెప్పుకోవడానికి చంద్రబాబుకి ఏముందని దుయ్యబట్టారు. వ్యవసాయానికి సంబంధించి తమ ప్రభుత్వం ఇచ్చేదే అసలైన డాక్యుమెంట్ అని తెలిపారు. వ్యవసాయం మూతపడిపోతే, చంద్రబాబు మూడు పూటలా అన్నం ఎలా తింటున్నాడని మంత్రి నిలదీశారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని, అది చూసి తట్టుకోలేకే చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Manipur violence: మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు.. ఈసారి కారణమేంటంటే..!

అంతకుముందు కూడా.. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ జగన్ గెలవడం, మరోసారి ముఖ్యమంత్రి కావడం అంతే నిజమేని మంత్రి కాకాణి నమ్మకం వెలిబుచ్చారు. రాష్ట్రానికి జగన్ మరోసారి సీఎం అవుతారని తేలిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి అని.. అందుకే ఆయన్ను దత్తపుత్రుడు అంటారని సెటైర్లు వేశారు.