NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు

Kakani Govardhan On Lokesh

Kakani Govardhan On Lokesh

Kakani Govardhan Reddy Comments On Lokesh Padayatra: లోకేష్ పాదయాత్ర ఒక జోక్ అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు చేశారు. సమాజంలో అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నా.. లోకేష్ వాటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. వైఫల్యం చెందిన ఓ నేత చేస్తున్న పాదయాత్ర ఇదని కౌంటర్ వేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. లోకేష్‌కు ప్రజా జీవితం గురించి తెలియదని.. అమెరికాకు వెళ్లి అక్కడ ఎలాంటి నిర్వాకాలు చేశాడో మీడియాకు తెలుసని అన్నాడు. మంత్రిగా ఉన్నపుడు మూగపోయిన గొంతును ఇప్పుడు తెరిచేందుకు వస్తున్నాడని సెటైర్ వేశారు. లోకేష్ ఏం మాట్లాడుతాడోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, అందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర గురించి వైసీపీ భయపడటం లేదన్నారు. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదని.. అందుకు లోకేష్ పాపపరిహార యాత్ర చేయాలని గోవర్ధన్ రెడ్డి సూచించారు.

Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు

ఇదే సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పప్పు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలని అడిగారు. రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు.. యువకులకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేసినా లోకేష్‌ని ప్రజలు నమ్మరన్నారు. అసలు లోకేష్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అందుకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమో ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని.. చంద్రబాబు దత్తపుత్రుడైన ప్యాకేజ్ స్టార్ పవన్‌ ఏమో 50 స్థానాలు కావాలని అడుగుతున్నాడని.. మరి మీ ముగ్గురిలో ఎవరు ముఖ్యమంత్రి అడుతారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాల్సిందేనని లోకేష్‌ని ప్రశ్నించారు.

Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్

Show comments