దేశంలోనే కడప జిల్లాకు ఉత్తమ జాతీయ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని కడప జిల్లాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ వాటర్ అవార్డ్స్-2020లో భాగంగా మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించారు. దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా… ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది. రాష్ట్రాల విభాగంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు మొదటి మూడు అవార్డులను సొంతం చేసుకున్నాయి.
Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
నీటి సంరక్షణకు కృషి చేసిన జిల్లాలు, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, నీటి వినియోగ సంఘాలకు ప్రతి ఏడాది నేషనల్ వాటర్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. 2020 ఏడాదికి సంబంధించి ఒక్క కేటగిరీలో మినహా ఏ కేటగిరీలోనూ తెలుగు రాష్ట్రాలకు అవార్డు దక్కలేదు. ప్రస్తుతం ప్రతి ఏడాది 1,100 శతకోటి ఘనపు మీటర్ల మేర నీటి అవసరం ఉందని… ఇది 2050 కల్లా 1,447 శతకోటి ఘనపు మీటర్లకు చేరుతుందని కేంద్రం పేర్కొంది. ప్రపంచంలో 18 శాతం జనాభా భారత్‌లోనే ఉన్నా నీటి వనరులు మాత్రం 4 శాతమే ఉన్నాయని.. అందుకే నీటి సంరక్షణకు అసాధారణ రీతిలో పనిచేసే సంస్థలను ప్రోత్సహించేందుకు 2018 నుంచి జాతీయ అవార్డులను ఇస్తున్నామని వివరించింది.
తాజావార్తలు
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!