NTV Telugu Site icon

Costly Fish: ఈ చేప ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు

Fish

Fish

అసలే వర్షాకాలం గోదావరిలో వివిధ రకాల చేపలు దొరుకుతుంటాయి. చెరువులు నిండి చేపలు రోడ్లమీదకు రావడం మనం చూశాం. ఆ చేపల్ని అందినకాడికి సంచుల్లో వేసుకుని జనం పట్టుకెళ్ళిపోయారు. తెలంగాణలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద చేప మత్స్యకారుడికి కాసుల వర్షం కురిపించింది. వర్షకాలం చేపలవేటకు వెళ్ళిన మత్స్యకారులకు ఖరీదైన చేపలు పడడం కామన్. కానీ సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుల వలకు కచిడి మగ చేప చిక్కింది.Fish22 లక్షల ఖరీదైన చేప ఇదేదీనిని అంతర్వేది మినీ హార్బర్లో వేలం పాట పెట్టారు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యాపారి ఈ కచిడి మగచేపను భారీ ధరకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఇంతకీ ఈ చేప ఖరీదెంతో తెలుసా. అక్షరాలా రెండు లక్షల రూపాయలకు పాడుకుని సొంతం చేసుకున్నాడు. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందులలో ఉపయోగిస్తారని అందువలనే ఈ చేప ఖరీదు ప్రియమని వ్యాపారి చెప్పారు. ఇలాంటి చేప అప్పుడప్పుడూ దొరుకుతుందని, దాంతో తమ కష్టాలు తీరతాయని మత్స్యకారులు చెబుతున్నారు. మొత్తానికి సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులకు అనుకోని అదృష్టం ఇలాంటి చేపల రూపంలో దొరుకుతూ వుంటుంది. ఒక్కోసారి నెలల తరబడి చేపల వేటకు అవకాశం వుండదు. ఇలాంటి అరుదైన చేపలు దొరికనప్పుడే వేలం వేసి నాలుగు డబ్బులు సంపాదిస్తారు గంగపుత్రులు. పులస చేపల్లాంటివి ఇలాంటి కాలంలోనే మత్స్యకారులకు అదృష్టం తెచ్చిపెడతాయి.
Read Also: CM KCR : భారీ వర్షాలు.. అధికారులకు సూచనలు, సలహాలు..