ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.. చంద్రబాబు సభలపై నేను డీజీపీకి ఫిర్యాదు చేసి.. కోర్టుకు వెళ్లాక వైఎస్ జగన్ ఇప్పుడు జీవో జారీ చేశారు.. అందుకు సీఎం జగన్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చంద్రబాబు కంటే వైఎస్ జగన్ వేయి రెట్లు బెటర్ అంటూ ఆకాశానికి ఎత్తిన పాల్.. నేను చెప్పిన సలహాలు వైఎస్ జగన్ కొన్ని పాటించారని తెలిపారు.. ఇక, ఏపీ అభివృద్ధి కోసం జగన్ నన్ను పిలిపించి మాట్లాడతారేమో చూస్తాను.. నా పాస్ పోర్టు పెట్టుకోండి.. లక్ష కోట్ల రూపాయలు తెస్తాను అన్నారు.
Read Also: Minister RK Roja: రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలే బుద్దిచెబుతారు..
బీజేపీని విమర్శిస్తున్నాను.. కానీ, దేశం కోసం ప్రధానికి సహకరిస్తున్నాను అన్నారు పాల్.. ప్రధాని.. కేంద్ర హోం మంత్రి నా సలహాలు తీసుకుంటున్నారన్న ఆయన.. పెద్ద ఎత్తున పెట్టుబడులు కేంద్రానికి వచ్చేలా చేశా.. ప్రధానికంటే జగన్ గొప్పవారా..? అని ప్రశ్నించారు. జగన్ నన్ను పిలిచి నా సలహాలు ఎందుకు తీసుకోరు..? చంద్రబాబుకు ఎలాగూ బుద్ది లేదు.. జగన్‌కే అయ్యింది? అని నిలదీశారు. డియర్ కేఏ పాల్ అని లేఖ రాస్తే చాలు.. పూర్తిగా సహకరిస్తాను అని ప్రకటించారు. మరోవైపు, కందుకూరులో ఎనిమిది.. గుంటూరులో మూడు ప్రాణాలు పోయాయి.. చంద్రబాబు శవాల రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో అంతటి ఘటన జరిగాక కూడా చంద్రబాబు కావలిలో మళ్లీ సభ పెడతారా..? నేను చంద్రబాబు.. టీడీపీ నేతలను శపిస్తున్నాను.. నాశనం అయిపోతారు అని ఫైర్ అయ్యారు.
ఇక, చంద్రబాబు అందర్నీ మోసం చేశారు.. తన మామనే కాదు.. నన్ను కూడా మోసం చేశారని చెప్పుకొచ్చారు కేఏ పాల్.. మరోవైపు, కేసీఆర్ ఏపీకి వస్తే చెప్పుతో కొడతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. రావెల కిశోర్ బాబు ఓ యూజ్ లెస్ ఫెలో అని ఫైర్ అయ్యారు.. రావెల గతంలో పాస్టర్ అంట.. మతం మార్చుకున్నానని మోసం చేసి బీజేపీలో చేరారన్న ఆయన.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు దూరంగా జరగాలని సలహా ఇచ్చారు. ఇక, వర్ల రామయ్య మంచోడే.. కానీ అడుక్కు తింటున్నాడు.. సార్.. సార్ అంటూ అడుక్కోవడం దేనికి వర్ల రామయ్య.. అని ప్రశ్నించారు.. వర్ల రామయ్య పోటీ చేసి ఓడిపోతే వంద కోట్ల ఇస్తాను అని ప్రకటించారు. హరిరామ జోగయ్య పిచ్చి పనుల కోసం ఫైట్ చేస్తున్నారు.. మనకు రాజ్యాధికారం కావాలా..? రిజర్వేషన్లు కావాలా..? అని ఎద్దేవా చేశారు కేఏ పాల్.