NTV Telugu Site icon

K Laxman: సినిమా హీరోలతో పాటు అందర్నీ బీజేపీలోకి ఆహ్వానిస్తాం..

K Laxman

K Laxman

ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఫోకస్‌ పెడుతోంది భారతీయ జనతా పార్టీ.. గతంలో పోలిస్తే.. ఇప్పుడు రెగ్యులర్‌గా ఏదో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తూనే ఉంది.. ఆ పార్టీ అగ్రనేతలు.. ఈ మధ్య వరుసగా టాలీవుడ్‌ ప్రముఖ హీరోలను కలవడం పొలిటికల్‌ హీట్‌ పెంచుతుంది.. ఇవాళ రాజమండ్రిలో పర్యటించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలు ఓబీసీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారని విమర్శించారు.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.. దివంగత నేత ఎన్టీఆర్ 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: JC Prabhakar Reddy: నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి..!

ఇక, తెలంగాణలో 26 బీసీ కులాలను కేసీఆర్ తొలగిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు కె. లక్ష్మణ్‌.. అంతేకాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులను బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారికి కేటాయించగలరా? అంటూ సవాల్‌ చేశారు. మరోవైపు.. రెండు రాష్ట్రాల్లో పార్టీ పిటిష్టానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న లక్ష్మణ్… సినిమా హీరోలతో పాటు చాలా మందిని బీజేపీలోకి ఆహ్వానిస్తాం అన్నారు. తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని పేర్కొన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌.

మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు.. వినాయక చవితి ఉత్సవాల ఆటంకాలపై ముఖ్యమంత్ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశామని వెల్లడించిన ఆయన.. ఇదే విషయంపై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.. వైసీపీ ప్రభుత్వం.. వినాయక చవతి విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలు చేస్తుందని ప్రకటించారు సోము వీర్రాజు.