ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపటి నుంచి నాన్ కోవిడ్ విధులను బహిష్కరిస్తామని పేర్కొంది. ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తూ
రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది.