JTC Venkateswara Rao: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్‌కు అసలైన పండుగ.. ప్రయాణికులను రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి.. అయితే, పండుగ సమయంలోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తోంది ఆర్టీసీ.. అదే సమయంలో.. ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్‌చేసుకునేవారికి రాయితీ కూడా కల్పిస్తోంది. అయితే, ఈ ఏడాది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను భారీ పెంచే అవకాశం ఉండడంతో.. అప్రమత్తం అయ్యారు రవాణాశాఖ అధికారులు.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన జేటీసీ వెంకటేశ్వరరావు.. సంక్రాంతికి ప్రతేడాది చేస్తున్న విధంగానే ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుందని.. దీనిపై రవాణ శాఖ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని తెలిపారు.. పండుగ దినాలను ఆసరా తీసుకుని ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుంది.. దీనికి చెక్ పెట్టేందుకు బార్డర్ చెక్ పోస్టుల్లో నిఘా పెడతామని వెల్లడించారు.
Read Also: Vidadala Rajini: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే.. పేర్లే వేర్వేరు
ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు చెక్ పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందిని పెడతామని తెలిపారు జేటీసీ వెంకటేశ్వరరావు. నిఘా బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. స్టాపేజ్ ఉన్న బస్సులను తిప్పుతారు.. ఫిట్నెస్ లేని బస్సులు.. టాక్స్‌లు కట్టని బస్సులు తిరిగే అవకాశం ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాసింజర్లకు ఇబ్బంది లేకుండా తనిఖీలు చేస్తాం.. సేఫ్టీ లేని బస్సుల్లో ప్రయాణం చేయవద్దని పాసింజర్లకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ నుంచే రవాణా శాఖ తనిఖీల డ్రైవ్ చేపట్టనున్నట్టు ప్రకటించారు జేటీసీ వెంకటేశ్వరరావు. కాగా, గతంలో.. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు.. చార్జీలను కూడా పెంచుతూ వెళ్లిన సందర్భాలున్నాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారి.. ప్రత్యేక బస్సులు నడుపుతూనే.. సాధారణ చార్జీలు వసూలు చేయడం.. ఇంకా రాయితీలు కూడా ప్రకటిస్తున్న విషయం విదితమే.
