Jogi Ramesh : విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం చేస్తున్నారు,” అని తెలిపారు.
Samantha : కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సమంత.. పూజలు
అంతేకాకుండా.. నకిలీ మద్యం కుంభకోణం చంద్రబాబు కి చుట్టుకుని, డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా దాన్ని ఇతరులకు అడ్డుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని జోగి రమేష్ అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి సందర్భంలో ‘నకిలీదా, లేదా నారావరి సారా?’ అని ప్రశ్నించే స్థితికి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ వదిలేసి నన్ను మద్యం కేసులో ఇరికాలని చూస్తున్నారని, ఇళ్ళకు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. నకిలీ మద్యంతో చాలామంది చనిపోతున్నారని, మద్యం షాపుల్లో అమ్ముతున్న మద్యం నాణ్యతను పరీక్షించటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
