Site icon NTV Telugu

Jogi Ramesh: జోగి రమేష్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు..

Ramesh

Ramesh

Jogi Ramesh: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్‌పై వైసీపీ నేతలు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు.

Read Also: Kanchana4 : పూజ – నోరా కాంబోతో లారెన్స్ కాంచన 4.. హారర్ కి గ్లామర్ టచ్..!

అయితే, మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్‌ పూర్తిగా అక్రమం.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు.. ఈ కేసులో కస్టడీలో ఉన్న ఏ-1 నిందితుడు జనార్థన్‌ రావు ద్వారా జోగి రమేష్‌ పేరు చెప్పించారు.. దానిపై జోగి చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి వరకు స్పందించని టీడీపీ నేతలు జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇంకా వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు.. లేని లిక్కర్‌ స్కామ్‌లు సృష్టించారని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు.

Read Also: Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..

ఇక, కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను తమకు అంటించేందుు కుట్ర చేస్తున్నారని వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జోగి రమేష్‌.. దానిపై హైకోర్టులో పిటిషన్‌ విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. అయితే, కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో పలువురి దుర్మరణం, మొంథా తుపాన్‌ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి డైవర్షన్‌ కోసమే జోగి రమేష్‌ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేయలేదు.. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు.. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వైసీపీ నాయకులు వెల్లడించారు.

Exit mobile version