హారర్ కామెడీ జానర్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచన ఫ్రాంచైజీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ హిట్ సిరీస్‌గా నిలిచిన ఈ సినిమాకు కొత్త భాగం “కాంచన 4” రూపంలో సిద్ధమవుతోంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈసారి హారర్‌కు గ్లామర్ టచ్ జోడించబోతున్నారు. అందాల తారలు పూజా హెగ్డే మరియు నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ వార్తపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వినిపిస్తున్న ఈ సమాచారం ఇప్పుడు అధికారికంగా ధృవీకరించబడింది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియాలో పూజా, నోరా పేర్లను ప్రకటిస్తూ వారిని టీమ్‌లోకి వెల్‌కమ్ చేసింది. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ, “భయంకరమైన సన్నివేశాల్లో కూడా తన అందంతో మంత్రముగ్ధులను చేస్తుంది – పూజ హెగ్డేకి స్వాగతం!”, “తన అందంతో హారర్‌ను కూడా మర్చిపోయేలా చేస్తుంది – నోరా ఫతేహికి స్వాగతం!” అంటూ పోస్టులు పెట్టారు.
Also Read : Tamannaah : ప్రేమలో నిజాయితీ ఉండాలి.. అబద్ధలు కాదు
ఈ కాంబినేషన్‌తో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు లారెన్స్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్, మరోవైపు పూజా – నోరా గ్లామర్ కాంబినేషన్, రెండింటి కలయికతో హారర్ కామెడీకి కొత్త లెవెల్ రాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. కాంచన 4 షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. గతేడాదే సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ సినిమా, ప్రీ ప్రొడక్షన్ మరియు కాస్టింగ్‌లో కొంత ఆలస్యమవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తోంది. కథా రచన, సెట్ డిజైన్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్ కొత్తగా ప్లాన్ చేసినట్లు సమాచారం.