రాష్ట్రంలో వీధి విక్రయదారులు బతుకుదెరువు, రక్షణ, క్రమబద్ధీకరణ చట్టంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ. తిరుపతి నగరంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల సంఘం రక్షణ క్రమబద్ధీకరణ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ.
2014 సంవత్సరంలో వీధి విక్రయదారులు జీవనోపాధి రక్షణ మరియు క్రమబద్దీకరణ చట్టం చేయబడింది. అయినా అనేక ప్రాంతాల్లో వీధి విక్రయదారులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ ,మున్సిపాలిటీల ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లాలని చేసే ఆదేశాల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో ఒక కోటి మంది వీధి విక్రయదారులు ఉన్నారన్నారు లక్ష్మీ నారాయణ. గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకు తెరువు లేక పట్టణాలకు వలస వచ్చే వీధి విక్రయదారులు గా జీవనం సాగిస్తున్నారన్నారు. వీధి విక్రయదారులు ఎక్కువ మంది మహిళలే ఉన్నారన్నారు. బ్యాంకులో రుణం, ఇన్స్యూరెన్స్, ఆరోగ్యపరమైన జాగ్రత్తలకు ప్రభుత్వాల బాధ్యత వహించాలన్నారు.