NTV Telugu Site icon

Janasena New Plan: జనసేన కొత్త ప్లాన్‌.. ఇక, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు..

Janasena

Janasena

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుస పర్యటనలు చేపడుతున్నారు.. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది జనసేన పార్టీ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు పవన్.. ఆ తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జనవాహిణి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు జగనన్న ఇళ్లపై సోషల్‌ ఆడిట్‌ కూడా చేపట్టారు.. అయితే, ఓవైపు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే మరోవైపు.. కొత్త సమస్యలను వెలికితీసేందుకు, పార్టీని పటిష్టం చేయడానికి సిద్ధం అవుతున్నారు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. దానికోసం కొత్త ప్లాన్‌ రూపొందించారు.

Read Also: Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు

జనసేన పార్టీ తాజా నిర్ణయం ప్రకారం.. నియోజకవర్గాలవారీగా విస్తృతస్థాయి సమావేశాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.. ఈ నెల 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల సమావేశాలు జరగనున్నాయి.. జిల్లాలో చేపట్టాల్సిన ఉద్యమాలు.. పెండింగ్ ప్రాజెక్టులు.. దీర్ఘకాలంగా ఉన్న అపరిష్కృత సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించి.. ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ విస్తృతస్థాయి సమావేశాలను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించనున్నారు. ఇక, కొన్ని సమావేశాలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఓవైపు ఉద్యమాలు చేస్తూనే.. మరోవైపు.. పార్టీ నిర్మాణం, ఇంకో వైపు.. కొత్త సమస్యలను గుర్తించి పోరాటం చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది జనసేన పార్టీ.