మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డుపై తొడగొట్టారు జనసేన నేతలు.. మంత్రి రోజాపై చేసినా అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, అరెస్ట్ చేసిన కిరణ్ రాయల్‌ను నగరి కోర్టులో హాజరు పర్చారు పోలీసులు.. కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది… 41ఏ నోటీసు కిరణ్ రాయల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన తర్వాత ర్యాలీ నిర్వహించారు జనసేన నేతలు.. ఓవైపు వర్షం కురుస్తున్నా.. కాసేపు ర్యాలీగా వెళ్లారు.. ఆ తర్వాత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి తొడకొట్టారు జనసేన నేతలు.. తొడగొట్టినవారిలో కిరణ్ రాయల్.. పసుపులేటి హరిప్రసాద్.. ఇతర జనసేన నేతలు ఉన్నారు.
Read Also: Twitter Blue tick : వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్..! ట్విట్టర్ బ్లూ టిక్‌పై యూటర్న్..!
కాగా, తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశామని నగరి పోలీసులు తెలిపారు… ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఆక్షేపించింది.. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కిరణ్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి రోజా విశాఖ ఎయిర్ పోర్టులో జబర్దస్త్ షో చేశారని, వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారంటూ.. కిరణ్ రాయల్ గతంలో వ్యాఖ్యానించారు.. పవన్ ను టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేదని.. దమ్ముంటే పవన్ ని టచ్ చేసి చూడండి అంటూ సవాల్ కూడా విసిరారు. వైసీపీ నేతలే విశాఖ గర్జన పేరుతో సభ పెట్టారని, విశాఖలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందన్నారు. పనికిరాని మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు, రోజా తమిళనాడులో పెళ్లి చేసుకున్నారని, అక్కడ రాజధాని పెట్టుకోవాలని కూడా ఎద్దేవా చేశారు.. మంత్రి రోజాకి విశాఖలో ఏం జరిగిందో తెలిసింది కదా, ఇంకోసారి పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చిన విషం విదితమే.
