విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి చేస్తామని పవన్ స్పష్టం చేశారు.
Read Also: Andhra Pradesh: రేపు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న సీఎం జగన్
అటు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమాజంలో సమస్యలు తెలుస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు. నేతలు అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం చేస్తామంటే కుదరదని పవన్ అన్నారు. తమకు పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరిస్తామని పవన్ పేర్కొన్నారు. దళిత, ఆదివాసీలు ఈ పాలకులకు ఓటు బ్యాంకు మాత్రమే అని.. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధ్యయనం చేస్తామని పవన్ తెలిపారు. దళిత, ఆదివాసీలను పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 29 పథకాలు రద్దు చేసిందని.. దేశం మొత్తం అమల్లో ఉన్న సబ్ ప్లాన్ నిధుల్ని ఇతర అవసరాలకు ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. దళిత ఆదివాసీల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని పవన్ హామీ ఇచ్చారు. కాగా జనసేన జనవాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియానికి తరలి వచ్చారు.
"జనవాణి – జనసేన భరోసా" కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన.#JanaVaaniJanaSenaBharosa
Full Album Link: https://t.co/gai1vHW7HF pic.twitter.com/sLUH60M6Th
— JanaSena Party (@JanaSenaParty) July 3, 2022
