JanaSena: జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటోంది.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పేరుతో వైసీపీ బీసీ కులాలను విడదీస్తోందని విమర్శించారు.. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు స్టిక్కర్ అతికించుకోవడం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఆయన.. స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవ పడటానికి కార్పొరేషన్లు ఉపయోగ పడ్డాయని ఎద్దేవా చేశారు.. నవరత్నాల పేరుతో బీసీలకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు.. ఏ పథకం కావాలని అడిగినా.. నవరత్నాల్లో ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. బీసీ సాధికారిత కలిగే విధంగా జనసేన గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని.. బీసీలంతా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సాధించాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా చెప్పుకొచ్చారు మనోహర్.
Read Also: Revanth Reddy: ఈడీ తలచుకుంటే.. కవితని గంటలోపే జైలుకి పంపొచ్చు
చేపల వేట నిషేధం సమయంలో రూ. 10 వేలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. నలభై శాతం మందికి కూడా ఈ సాయం అందలేదని ఆరోపించారు నాదెండ్ల మనోహర్.. కొంతమంది బీసీ జనగణన గురించి ఏదేదో మాట్లాడతారు.. బీసీ జనగణన జరగాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు…ఈ సమావేశంలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పాలని కోరారు.. పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకుంటే.. జనసేన అధికారంలోకి రాగానే వారికి ఉచిత విద్యుత్ అందిస్తాం అన్నారు. బీసీలను వైఎస్ జగన్ ఏ విధంగా మోసం చేస్తున్నారో ఆలోచన చేయండి.. చేతి వృత్తి మీద ఆధారపడిన వారందరూ అభివృద్ధి కావాలనేదే పవన్ కల్యాణ్ కోరిక.. బీసీలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.