NTV Telugu Site icon

Sankranti Lucky Draw: సంక్రాంతి లక్కీ డ్రా..! మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు

Sankranti Lucky Draw

Sankranti Lucky Draw

సంక్రాంతి పండుగ నేపథ్యంలో లక్కీ డ్రా పేరుతో టికెట్లు విక్రయిస్తున్నారంటూ మండిపడుతున్నారు జనసేన నేతలు.. ఈ విషయంలో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్‌లో మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు విక్రయిస్తున్నారని.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయని అంటున్నారు.. అసలు ఈ టికెట్ల విక్రయానికి సచివాలయలు టికెట్స్‌ కౌంటర్లుగా మారిపోయాయని.. వాలెంటిర్ల ద్వారానే ఈ లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు సాగిస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.. లక్కీ డ్రాలు చట్ట విరుద్ధం.. అయినా, సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో ఈ టికెట్లు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు.. లక్కీ డ్రా టికెట్లుపై పోలీసులు వెంటనే స్పందించాలని.. మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. లక్కీ డ్రా నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ విషయంపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంటేశ్వరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. అయితే, ఈ లక్కీ డ్రా వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also: Special Trains for Sankranti: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మరో 16 ప్రత్యేక రైళ్లు

Show comments