Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Janasena Chief Pawan Kalyan Tributes Pingali Venkaiah

Pawan Kalyan: ఇప్పటికైనా పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలి

Published Date :August 2, 2022 , 12:19 pm
By Ramesh Nalam
Pawan Kalyan: ఇప్పటికైనా పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan Tributes Pingali Venkaiah: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మహానుభావుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారని.. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి అది ప్రతీకగా నిలిచిందని పవన్ అన్నారు. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదన్నారు. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య చరితార్థుడు అని కొనియాడారు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం అన్నారు. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నట్లు తెలియజేశారు.

భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి కూడా జరగడం యాధృచ్చికమే అయినా అదొక మరుపురాని మహత్తర ఘట్టమని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశం పరాయిపాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని ఏళ్ల తరబడి ఘోషిస్తూ, శ్రమిస్తూ చివరికి ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని పింగళి వెంకయ్య రచించి, ప్రచురించారన్నారు. చివరకు 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆశీస్సులతో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందిందని.. ఈ ఘడియల కోసం పింగళి వెంకయ్య ఒక తపస్సునే చేశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.

విద్యాధికుడు, వ్యవసాయం, భూగర్భ శాస్త్రంలో నిపుణుడు అయిన పింగళి వెంకయ్యను ఎందువల్లనో ఇటు తెలుగు రాజకీయ నాయకులు, అటు జాతీయ నాయకులు సరైన సమయంలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడంతో ఆర్థికంగా దుర్భరమైన జీవితాన్ని చరమాంకంలో చవి చూశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. ఆ త్యాగశీలికి ‘భారతరత్న’ పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక అని.. కానీ అది ఇంతవరకు నెరవేరకపోవడం విచారకరమన్నారు. దేశంలో ‘ఆజాది కా అమృతోత్సవ్’ వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియలలో పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.

తెలుగు కీర్తి పతాక శ్రీ పింగళి వెంకయ్య గారు – JanaSena Chief Shri @PawanKalyan #PingaliVenkayya pic.twitter.com/OYLN2SByVA

— JanaSena Party (@JanaSenaParty) August 2, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bharata ratna
  • JanaSena Party
  • National Flag
  • pawan kalyan
  • pawan kalyan tributes pingali venkaiah

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions