Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, నటుడు వీర్ దాస్ కలిసి నటించిన రివాల్వర్ రాణి చిత్రంలోని ఓ కిస్ సీన్‌పై తాజాగా వినిపిస్తున్న ఆరోపణలు ఆసక్తిగా మారాయి. దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా కంగనా ఆ సన్నివేశాన్ని కొనసాగించిందని, ఈ క్రమంలో వీర్ దాస్ పెదవికి గాయం అయిందని సీనియర్ జర్నలిస్ట్ సిమీ చందోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో నిజమెంత? దీనిపై కంగనా, వీర్ దాస్ ఎప్పుడైనా స్పందించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి.
2014లో విడుదలైన ‘రివాల్వర్ రాణి’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించకపోయినా, అందులో కంగనా రనౌత్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. రాజకీయ నాయకురాలు, గ్యాంగ్‌స్టర్ అల్కా సింగ్ పాత్రలో ఆమె చూపించిన నటన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సినిమాలో నటుడు, కమెడియన్ వీర్ దాస్‌తో ఆమెకు సంబంధించిన ఒక గాఢమైన ముద్దు సన్నివేశం కూడా బాగా పండింది. అయితే దాదాపు దశాబ్దం తర్వాత ఆ సన్నివేశం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ వివాదానికి కారణం సీనియర్ జర్నలిస్ట్ సిమీ చందోక్ చేసిన వ్యాఖ్యలే. సిద్ధార్థ్ కన్నన్ నిర్వహించిన ఒక పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆమె, రివాల్వర్ రాణి షూటింగ్ లో ఒక సంఘటన జరిగినట్లు ఆమె వివరించారు. ఆమె కథనం ప్రకారం, దర్శకుడు సన్నివేశం పూర్తయిందని “కట్” చెప్పిన తర్వాత కూడా కంగనా పాత్రలో పూర్తిగా లీనమై వీర్ దాస్‌ను ముద్దు పెట్టుకోవడం కొనసాగించిందని, ఆ సమయంలో అతని పెదవిని కొరకడంతో రక్తం కూడా వచ్చిందని ఆరోపించారు. అయితే ఈ వాదన పూర్తిగా సిమీ చందోక్ వ్యక్తిగత వ్యాఖ్యలపైనే ఆధారపడి ఉంది. దీనిని నిర్ధారించే ఆధారాలు గాని, చిత్రబృందం నుంచి గాని ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు.
ఈ పుకార్లు కొత్తవి కూడా కావు. 2023లో సోషల్ మీడియాలో ఇదే తరహా వార్తలు వైరల్ అయినప్పుడు కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సరదాగా స్పందిస్తూ, “హృతిక్ రోషన్ తర్వాత ఇప్పుడు పాపం వీర్ దాస్‌ను కూడా నేను అవమానించానా? ఇది ఎప్పుడు జరిగింది?” అంటూ నవ్వుతున్న ఎమోజీలతో పోస్టు చేశారు. ఆ స్పందన ద్వారా ఈ వార్తలను ఆమె సీరియస్‌గా తీసుకోలేదని, వాటిని కేవలం సోషల్ మీడియా పుకార్లుగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ వ్యవహారంపై వీర్ దాస్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే దర్శకుడు సాయి కబీర్ లేదా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ ఆరోపణలను ధృవీకరించలేదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పుకారు మాత్రం షికారు చేస్తోంది.
ఇదిలా ఉండగా, కంగనా రనౌత్ ఇటీవల విడుదలైన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రంలో నటించారు. 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో కామా ఆసుపత్రి సిబ్బంది చూపిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మరోవైపు వీర్ దాస్ హ్యాపీ పటేల్: డేంజరస్ డిటెక్టివ్ చిత్రంతో దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాల కంటే, దశాబ్దం క్రితం చిత్రీకరించిన ఒక కిస్ సీన్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదమే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చకు దారితీస్తోంది.
- Tags
- cinema
- Kangana Ranaut
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!