Bolisetty Satyanarayana: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులు, పదవుల విషయంలో జనసేన కోసం పని చేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.. దేవాలయ కమిటీల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 5 ఆలయ కమిటీల్లో జనసేనకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదు అన్నారు. కార్యకర్తలు, వీర మహిళల్లో నిరుత్సాహం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని కాపాడాలని చంద్రబాబు పవన్‌లకు బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
Read Also: Union Budget 2026: ఇళ్ల ధరలు తగ్గుతాయా? బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్‌క్లాస్
అయితే, స్థానిక ఎన్నికలకు ముందు జోక్యం అవసరమని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జనసేన త్యాగానికి గౌరవం ఇవ్వాలి అని కోరారు. గతంలో పార్టీ కమిటీల వ్యవహారంలో రోడ్డుపై కొచ్చి ప్రశ్నించిన కొవ్వూరు ఇన్చార్జ్ ని పదవి నుంచి తప్పించిన పార్టీ అధిష్టానం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే అనుకున్న ఒప్పందం, జాయింట్ అగ్రిమెంటు అమలు జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవుల విషయంలో 60:30:10 శాతం విధానం లెక్కలకే పరిమితం అవుతుంది. జనసేన పార్టీ కోసం చేసిన వీర మహిళలు, నాయకులకు పదవులు దక్కలేదన్నారు. జనసేన పార్టీలో పదవులు వచ్చిన వారికి జనసేన అనే పేరు పెట్టారు తప్ప.. వాళ్ళు ఎక్కడ పార్టీ కోసం పని చేయలేదని పేర్కొన్నారు.
Read Also: Vijay Devarakonda : నితిన్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్ దేవరకొండ సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్
ఇక, పార్టీ కోసం పని చేయని వారికి పార్టీ పేరు చెప్పి పదవులు ఇచ్చేశారని బొలిశెట్టి అన్నారు. ఇలాంటి వ్యవహారం క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది.. పార్టీ అధినాయకులకు తెలిసి ఇదంతా జరుగుతుందని అనుకోవడం లేదు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని స్వయంగా ఫిర్యాదులు వస్తున్నాయి.. తన సొంత నియోజకవర్గమైన విశాఖపట్నం ఈస్ట్ లో ఏర్పాటు చేసిన 5 దేవాలయ కమిటీల్లో ఒకటి కూడా జనసేనకి ఇవ్వలేదు.. ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏంటి అన్యాయమని స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే.. అధిష్టానమే పంపిందంటూ సమాధానం చెబుతున్నారు.. ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఇలవేల్పుగా కొలుచుకునే కరక చెట్టు పాలుమాంబ ఆలయ కమిటీలో 11 మంది ఉంటే ఇందులో జనసేనకి ఒక స్థానం కూడా ఇవ్వలేదు.. ఎమ్మెల్యేలు అడిగితే తప్పు జరిగిందని అంటున్నారు.. ఇలాంటి పరిస్థితులే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి.. అందుకే ఈ వీడియో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని బొలిశెట్టి చెప్పుకొచ్చారు.
Read Also: Union Budget 2026: ఇళ్ల ధరలు తగ్గుతాయా? బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్‌క్లాస్
అలాగే, జనసేన పార్టీకి ఇవ్వాల్సిన 30 శాతం పదవులు దక్కడం లేదని జనసేన నేత సత్యనారాయణ అన్నారు. దీనిపై జనసైనికులు నిలదీయండి.. ఇలాంటి పరిస్థితులు ఉంటే సచ్చింది అనుకున్న జగన్ పార్టీ బలపడుతుంది.. మళ్ళీ మనం రోడ్ల మీదకు వెళ్లి పోరాటాలు చేయాలని సూచించారు. పార్టీ అధినాయకులు, రాష్ట్రస్థాయి లెక్కలు కాకుండా.. క్షేత్రస్థాయి లెక్కలు పరిశీలించాలని కోరుతున్నాను.. పారదర్శక లేకపోతే మళ్ళీ పోరాటాలు చేయాల్సి వస్తుంది అని తేల్చి చెప్పారు.
