రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది.. కాంగ్రెస్‌కు భారత్ జోడో యాత్ర సంజీవని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్.. తమిళనాడు, కేరళను దాటి ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర సాగుతుండగా.. రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు.. అయితే, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది భారత్ జోడో యాత్ర.. దీంతో, కాంగ్రెస్ నేతలు పాదయాత్ర ఏర్పాట్లలో మునిగిపోయారు.. అందులో భాగంగా కర్నూలులో పర్యటించారు జైరాం రమేష్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. 18న కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. 85 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది… నాలుగు రోజుల పాటు రోజుకు 21 కిలోమీటర్ల మేర ఏపీలో యాత్ర సాగనుందని.. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణకు వెళ్తుందని వెల్లడించారు. తమిళనాడు 3 రోజులు, 18 రోజులు కేరళ, 21 రోజులు కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
Read Also: Venkaiah Naidu: ఏపీ రోడ్ల పరిస్ధితి దారుణం.. వాటిపై దృష్టి పెట్టండి..!
ఇక, బీజేపీ, మిత్రపక్షాలు భారత్ జోడో యాత్రపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు జైరాం రమేష్… 3,570 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేస్తారు.. 120 మంది భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు… అందులో మూడో వంతు మహిళలు వున్నారని తెలిపారు.. మరోవైపు, ఆండ్రాయిడ్ లో భారత్ జోడో యాత్ర యాప్ ఉందని.. డౌన్ లోడ్ చేసుకుంటే భారత్ జోడో నిత్యం లైవ్ చూడొచ్చు అని ప్రకటించారు.. ఇక, తెలుగులో భారత్ జోడో థీమ్ పాట 18న విడుదల చేస్తాం అన్నారు. ఆర్థిక అసమానత పెరగడం, కుల,మత, బాషా, సామాజిక విభజన, రాజకీయ కేంద్రీకృతం.. వీటికి వ్యతిరేకంగా భారత్ జోడో కొనసాగుతుందన్న ఆయన.. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనం చేసింది.. ఇప్పుడు, ఆర్ఎస్ఎస్, బీజేపీ భారత్ జోడో యాత్రలో ప్రజల స్పందనను చూసి భయపడుతున్నాయన్నారు.. కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్ర సంజీవనిగా అభివర్ణించిన ఆయన.. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జైరాం రమేష్.