NTV Telugu Site icon

AP Deputy CM Pawan: ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు..

Ap Dy Cm

Ap Dy Cm

AP Deputy CM Pawan: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేను శాస్త్రవేత్తను కాదు.. కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.. నాకు ఆశ్చర్యం కలిగింది చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది.. చిన్నప్పటి నుంచి శ్రీహరి కోటకు రావాలని అనుకునేవాడిని.. అది ఇప్పుడు నెరవేరింది.. నేను నెల్లూరులో చదువుకున్నా.. అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు.. దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది.. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని.. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుడిని చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ ను రూపొందించాం.. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు.. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది.. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది.. చాలా మంది యువకులు ఇసురు నుంచి స్ఫూర్తి పొందుతున్నారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Read Also: Sobhita : ఆమె కుక్కగా పుట్టినా పర్లేదు… సమంతపై శోభిత పాత పోస్ట్ వైరల్!

ఇక, నేను కూడా షార్ కేంద్రం నుంచి స్ఫూర్తి పొందాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఎంతో కష్టపడి విజయాలు సాధిస్తున్నారు.. ఎన్ని సార్లు అపజాయాలు ఎదుర్కొన్నారు.. కానీ ఇప్పుడు ఒకే రాకెట్ నుంచి వందకు పైగా ఉపగ్రహాలు పంపుతున్నారు.. చంద్రుడుపైకి కూడా ఉపగ్రహాలు పంపి మన ప్రతిభను చాటారు.. డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్టు చిన్న ఆశలు పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించాలి.. నాకు కూడా నా దేశం నెంబర్ వన్ గా ఉండాలనేది కోరిక.. విక్రం సారాభాయ్ తో పాటు ఎందరో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి కృషి చేశారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనం విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇక్కడి నుంచి ప్రయోగిస్తున్నాం.. భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్సాఫ్.. ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్ళు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read Also: Manu Bhaker: భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలి..

అలాగే, ఇస్రోలో పని చేసే ప్రతి సైంటిస్ట్ కు నా సెల్యూట్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో సైంటిస్టులను చప్పట్లతో ముంచెత్తాలన్నారు. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు అని కోనియాడారు. రాకెట్ ప్రయోగాలు జరిగేటప్పుడు శాస్త్రవేత్తలపై ఎంతో ఒత్తిడి ఉంటుంది.. చంద్రునిపైకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు నిజంగా మనమందరం రుణపడాలి అని ఆయన పేర్కొన్నారు. హాలీవుడ్ లో తీసే సినిమా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

Show comments