SSLV D1: మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన శ్రీహరికోట.. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న తొలి ఎస్ఎస్ఎల్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. నేడు షార్ వేదికగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో తొలి రాకెట్ ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్-2ఏతోపాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జి ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాదీ శాట్‌తో రోదసీలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఇస్రో వైపు తిప్పేందుకు మన శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆజాదీశాట్ ఉపగ్రహాన్ని దేశంలోని 75 పాఠశాలలకు చెందిన విద్యార్ధినుల విజ్ఞానంతో సైంటిస్టులు రూపొందించడం విశేషం.
Read Also: Lightning Strike: చమురు నిల్వ కేంద్రంలో పిడుగు.. 80 మందికి గాయాలు, 17మంది మిస్సింగ్
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
- Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
కాగా ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్‌ను ప్రయోగించేందుకు షార్ సైంటిస్టులు శనివారం ఉదయం 11 గంటలకు వాహన సంసిద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్) నిర్వహించారు. తిరువనంతపురం వీఎస్‌ఎస్‌సీ సెంటర్ శాస్త్రవేత్త ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన సమావేశమైన శాస్త్రవేత్తలు ప్రయోగ రిహార్సల్స్‌లో నమోదైన రాకెట్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. అనంతరం శనివారం సాయంత్రం షార్ డైరెక్టర్ రాజరాజన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ నిర్వహించారని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. అటు ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకునేవారికి ఇస్రో అద్భుత అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను షార్ వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మూడు రోజుల కిందట సూచించగా భారీ స్పందన లభించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..