NTV Telugu Site icon

Internet problems: వాటమ్మా…వాట్ ఈజ్ దిస్ అమ్మా

Net

Net

ఒక్క ఘటనతో ఎన్నో సమస్యలు తెరమీదకు వచ్చాయి, కోనసీమ జిల్లా వాసులకు ఇంటర్నెట్ కష్టాలు తీరడం లేదు. నెట్ కోసం గోదారి గట్టు చేరుకుంటున్నారు జనం. అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కడ వస్తే అక్కడికి చేరుకుంటున్నారు జనం. గోదావరి గట్ల మీదకు వచ్చి నెట్ సిగ్నల్స్ కోసం పడిగాపులు పడుతున్నారు.

 

కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రం హోంకి అలవాటుపడ్డారు. కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడంతో స్వగ్రామాలకు, అత్తారింటికి వెళ్ళిపోయారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. అయితే కోనసీమ జిల్లా రచ్చతో వారికి నెట్ ప్లాబ్లంస్ వస్తున్నాయి. కోనసీమ జిల్లా పేరు పై అమలాపురం లో జరిగిన అల్లర్లతో ఐదు రోజులుగా ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలుపుదల చేశారు. మరికొద్ది రోజులు ఈ కష్టాలు తప్పవంటున్నారు పోలీసులు. దీంతో నెట్ లేక అన్ని వర్గాలు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రభుత్వ కార్యాలయాలు అటు ప్రైవేటు సంస్థలతోపాటు వర్క్ ఫ్రం హోమ్ తో ఇళ్లకు పరిమితమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు సైతం నెట్ కోసం నానా అవస్థలు పడుతున్నారు.

 

దీంతో నెట్టు ఉన్న సమీప గ్రామ ప్రాంతాలకు పట్టణాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాలు అయితే గోదావరి గట్టుకు అవతల నెట్ సేవలు పని చేస్తుండడంతో గట్టు ఇవతల లంక గ్రామాలకు ఉద్యోగస్తులు తరలి వెళ్లి తమ పనులను చేసుకుంటున్నారు. దీంతో లంక గ్రామాల్లో గోదావరి గట్లు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. వేసవితో ఒకపక్క ఉక్కపోత ఇబ్బందిపెడుతోంది. మరోపక్క గోదావరి గట్టున చెట్ల కింద ఉపశమనం పొందుతూ ఉద్యోగులు తమ పనులను నిర్వర్తిస్తున్నారు. ఇంటర్నెట్ ఎప్పుడు ఇస్తారు తమ బాధలు ఎప్పుడు తీరతాయి ఉంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Krithi Shetty: యాంకర్ల ఓవరాక్షన్.. ఏడ్చేసిన నటి