CM Chandrababu : విశాఖ నగరం ఈ ఉదయం అద్భుత దృశ్యానికి వేదికైంది. అర్బన్ సముద్రతీరాన ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ యోగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగాసనాల ప్రదర్శన 45 నిమిషాలపాటు సాగనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతోపాటు స్థానికులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భారతీయ మాతృకలపై ఆధారపడిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నారు. దేశంలోనే 12 లక్షల ప్రాంతాల్లో యోగ ఆసనాలు నిర్వహించబడుతున్నాయని ఆయన తెలిపారు.
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్?
ఈసారి యోగా దినోత్సవం కొత్త రికార్డులను నెలకొల్పనుందని, సెప్టెంబర్ నుండి ‘యోగ లీగ్’ ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్‌రోల్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్ సృష్టించారని ఆయన అభినందించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందని, జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాని పాటిస్తామని ఆయన అన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు విభిన్న వయసుల వారు యోగాసనాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అమూల్య బహుమతుల్లో యోగా కూడా ఒకటి అని మోడీ ఇప్పటికే అనేక సందర్భాల్లో పేర్కొనగా, ఈ వేడుకలు ఆ విషయాన్ని మరోసారి నిరూపించాయి.
