Site icon NTV Telugu

Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఎగ్జామ్ హాల్స్‌లో సీసీ కెమెరాలు..

Inter

Inter

Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానున్నాయి. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధన పెట్టారు. ఒక్క నిమిషం ఆలస్యం అయిన నిబంధనల ప్రకారం విద్యార్ధులకు పరీక్ష హాల్ లోకి నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టారు.

Read Also: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు

అయితే, ప్రతి పరీక్ష గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్ష కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్ లు నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యార్ధులు సకాలంలో ఎగ్జామ్స్ సెంటర్ లకి చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రం దగ్గర ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Mexican Drug Lord El Mencho: $15 మిలియన్ రివార్డ్ ఉన్న డ్రగ్ కింగ్‌పిన్.. ఎల్ మెంచో సైనిక ఆపరేషన్‌లో హతం

ఇక, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్ధులు సమయ పాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం లేదని తెలిపారు. ఏదైనా అత్యవసర సమస్యలు తలెత్తితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రలో రూమ్, టోల్ ఫ్రీనెంబర్ 1800 425 1531కి కాల్ చేయాలని సూచనలు చేశారు.

Exit mobile version